![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -528 లో....పెద్దావిడ తన చిన్న కూతురు లేకుండా పుట్టినరోజు చేసుకోనని చెప్తుంది. తిండితిప్పలు లేకుండా బాధపడుతుంటే భద్రవతి వచ్చి.. సరే అమ్మ నీకు నచ్చినట్లే వాళ్ళ కుటుంబం మన కుటుంబంతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటుందని భద్రవతి చెప్పగానే పెద్దావిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి అక్క నువ్వు ఆ పనోడి కుటుంబం తో కలిసి పుట్టినరోజు ఏంటని సేనాపతి అడుగుతాడు. కోపం పెట్టుకొని అమ్మని దూరం చేసుకోలేం కదా అని భద్రవతి అంటుంది.
పెద్దావిడ సంతోషంగా రామరాజు ఇంటికి వెళ్తుంది. తనని చూసి ఆ భద్రవతి అప్పుడే నా ప్లాన్ ని అమలు చేస్తుందని వల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి బామ్మ గారు ఇలా వచ్చారని వల్లి హడావిడి చేస్తుంది. ఇంట్లో అందరిని పిలుస్తుంది. ఎందుకు అలా అరుస్తున్నావ్ మా అమ్మ మా ఇంటికి వచ్చింది నీ హడావిడి ఏంటోనని వేదవతి అంటుంది. మీకొక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చానని పెద్దావిడ అంటుంది. భద్రవతి నా పుట్టినరోజు మీతో కలిసి చేసుకోవడానికి ఒప్పుకుంది.. పైగా మీ ఇంట్లో చెయ్యడానికి అని పెద్దావిడ అనగానే అందరు షాక్ అవుతారు. ఏంటి మీరు అనేది అని అందరు షాక్ అవుతారు. నాకు ఎందుకో తేడా కొడుతుందని రామరాజు అంటాడు. నాక్కూడా అని ధీరజ్ అంటాడు. ఏం డౌట్ లేదు రామరాజు.. నేను తిండి తిప్పలు మానేసి ఉన్నాను.. అందుకే ఒప్పుకుంది.. నువ్వు కూడా ఒప్పుకోమని పెద్దావిడ రామరాజు ని రిక్వెస్ట్ చేస్తుంది. ఒకరకంగా ఆ భద్రవతిలో మార్పు రావడానికి అమూల్యనే కారణం అయి ఉండొచ్చు ఎందుకంటే మొన్న కేసు వెనక్కి తీసుకుంది కదా అని వల్లి అనగానే నిన్ను దీంట్లో ఎవరు కలుగజేసుకోమన్నారని వేదవతి కోప్పడుతుంది.
పెద్దావిడ రిక్వెస్ట్ చెయ్యడంతో రామరాజు ఒప్పుకుంటాడు. వేదవతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఆ తర్వాత వల్లి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. నీకు ఇచ్చిన సాక్ష్యంతో ఆ ప్రేమ, ధీరజ్ ని విడగొట్టక ఆ భద్రవతి చేతికి ఎందుకు ఇచ్చావని వల్లిని భాగ్యం కోప్పడుతుంది. నా ప్లాన్ ఏంటో మీకు తెలియదని వల్లి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |